![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-339 లో.. అందరు కలిసి భోజనం చేస్తుంటారు. కావ్య వాళ్ళ బావని రుద్రాణి గమనిస్తుంటుంది. దీంతో కావ్య బావ తనని చూసి.. మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.. మా స్వప్నకి అత్తగారంటే నమ్మలేకపోతున్నా.. మీ డైట్ ఏంటో చెప్పండి అని పొగిడేస్తాడు. అతని మాటలకు పొంగిపోయిన రుద్రాణి.. నన్ను రాహుల్‌ని చూస్తే మీ తమ్ముడా అంటారు తెల్సా అని అంటుంది. ఆ మాటతో స్వప్న.. కాస్త నేలపై నిలబడండి అత్తయ్యా అని అంటుంది. ఏంటీ అని రుద్రాణి అడగడంతో.. మీరు నా కాలు తొక్కేస్తున్నారు చూసుకోండి అని అంటుంది.
ఇక కావ్య అయితే రాజ్ రావడం చూసి.. వేసుకో బావా అని కొసరికొసరి వడ్డించేస్తుంది. ఆ సీన్ చూసి రాజ్ కుళ్లుకుంటూ అక్కడే నిలబడి ఉంటాడు. ఇంతలో ఇందిరా దేవి వచ్చి.. ‘ఏంటి రాజ్ ఇక్కడే నిలబడిపోయావ్.. ఏం చూస్తున్నావని అడుగుతుంది. రాజ్ ని కూర్చోబెట్టి కాసేపు మాటలతోనే ఆడుకుంటారు. అమెరికా వెళ్ళేవరకు ఇక్కడే ఉండాలని అందరిచేత మాట తీసుకుంటాడు కావ్య వాళ్ళ బావ. ఆ తర్వాత రాజ్ ని ఇండైరెక్ట్ గా పొగుడుతుంది కావ్య. చూశావా బావా.. మా ఆయన సంస్కారం.. దుగ్గిరాల వారసుడా? మజాకా అని అంటుంది కావ్య. సరే సరే.. మీ బావ వెళ్లే వరకూ నువ్వే అన్నీ చూసుకోవాలి.. ఏ లోటు రాకూడదని చెప్తుంది ఇందిరాదేవి. దీంతో రాజ్.. బావని చూసి.. వీడేంట్రా బాబూ.. నాకు మగ సవతిలా దాపరించాడని విసుక్కుంటాడు. ఆ తరువాత బావకి రూమ్ చూపించి.. ఇక్కడే నువ్వు ఉండాలి బావా.. గది ఎలా ఉందని అంటుంది. గది సంగతి ఓకే కానీ.. రాజ్‌ని ఒక్కడ్నే అంటే సరే గానీ అందరిమందు నటించాలంటే గిల్టీగా ఉందని అంటాడు వాళ్ళ బావ. నాకూ అలాగే ఉంది బావా.. కానీ ఈ ఐడియా అమ్మమ్మ గారే ఇచ్చారని కావ్య అంటుంది.
.webp)
ఇంత మంచి మనుషుల్ని మోసం చేయడం మంచిది కాదేమో అనిపిస్తుంది బుజ్జీ అని కావ్య వాళ్ళ బావ అనడంతో.. అలాంటివేం మనసులో పెట్టుకోకు బాబూ అని గదిలోకి వస్తుంది ఇందిరాదేవి. నువ్వు గిల్టీగా ఫీల్ కావడానికి నువ్వు ఎవర్నీ మోసం చేయడం లేదు.. నా మనవరాలి జీవితాన్ని నిలుపుతున్నావ్.. ప్రతిసారీ న్యాయంగా వెళ్లాలంటే కుదరదని ఇందిరాదేవి అంటుంది. మీరు చెప్తున్నది నిజమే అమ్మమ్మా.. కానీ తరువాత నిజం తెలిస్తే మన పరిస్థితి ఏంటని కావ్య అడుగుతుంది. ధర్మాన్ని కాపాడటానికి కొన్నిసార్లు అధర్మమైన దారిని ఎంచుకోకతప్పదు. ఆ దారి కూడా ధర్మమే అవుతుంది. ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నా కదా.. విషయం బయటకొస్తే బాధ్యత నాది.. మీరు భయపడొద్దని అంటుంది ఇందిరాదేవి. అన్నయ్యలో ఆల్రెడీ జెలసీ స్టార్ట్ అయ్యింది. తొందరలోనే బయటపడిపోతాడని అంటాడు. నా మవవడ్ని అంత తక్కువ అంచనా వేయొద్దని ఇందిరాదేవి అంటే.. అయితే ఈ రోజునుంచి అన్నయ్యలో ఉన్న ప్రేమను బయటకు తీసుకుని రావడమే మన పని అని కావ్య వాళ్ళ బావ అంటాడు. ఇక కావ్య ఆలోచిస్తూ ఉండగా.. ఎందుకమ్మా అలా ఉన్నావ్.. ఇక ధైర్యంగా ఉండు.. నీకు అంతా మంచే జరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. ఇక రుద్రాణి.. కావ్యపై అనుమానం పెంచుకుంటుంది. ఏదో జరుగుతుంది.. కావ్య కావాలనే బావని ఇంటికి తీసుకొచ్చింది.. పైగా కావ్య కావాలనే వాళ్ల బావతో చనువుగా ఉంటుంది.. వాళ్లపై ఓ కన్నేయాలని రాహుల్‌కి చెప్తుంది రుద్రాణి.
మరోవైపు కావ్య, రాజ్ ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. వాళ్ళ బావ కాల్ చేయడంతో సడన్ గా బెడ్ మీద నుండి పడిపోతాడు. అది చూసి కాలు జారారా అండి అని కావ్య అనగా.. లేదు బెడ్ మీద నుండి జారానని చెప్తాడు. మా బావ వెన్నెల్లో చూస్తూ కబుర్లు చెప్తాను రమ్మని పిలుస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను వెళ్తే జెలస్ అని అనుకుంటుందేమో అని రాజ్ మొదట అనుకున్నా.. ఆ తర్వాత వాళ్ళకి కనపడకుండా విందామని అనుకుంటాడు. ఇక రాజ్ వారి మాటలు వింటున్నాడని గ్రహించిన కావ్య, ఆమె బావ ఇద్దరు తెగ నటిస్తారు. ఇక వాళ్ళ మాట్లాడేది భరించలేని రాజ్ వాళ్ళ ముందుకు రాగానే ఆ డ్రామా ముగుస్తుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇందిరాదేవీతో యోగాసనాలు చేపిస్తుంటాడు కావ్య వాళ్ళ బావ.. అది రాజ్ కి చూపించి చూసారా మా బావకి ఎన్ని విషయాలు తెలుసో.. జీనియస్ అని కావ్య అంటుంది. మీ బావని పొగడడానికి ఎంతిస్తున్నాడు అని రాజ్ అనగానే.. నేను మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నాను.. మీరెమిస్తున్నారు విడాకులు తప్ప అని కావ్య అంటుంది. ఏయ్ ఎయ్ గట్టిగా అరవకు అని రాజ్ కంగారుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |